తెలంగాణ

రుణమాఫీకి కొత్త గైడ్ లైన్స్.. ఇలా చేస్తే అందరి ఖాతాల్లో డబ్బులు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రుణమాఫీ రాజకీయం కాక రేపుతోంది. రుణమాఫీపై అధికార, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. 42 లక్షల రైతు ఖాతాల్లో 31 వేల కోట్ల రూపాయల నిధులు జమ చేస్తున్నట్లు అధికారపక్షం చెబుతుండగా అంతా తప్పుల తడకగా రుణమాఫీ జరుగుందని కనీసం 40 శాతం కూడా మాఫీ కాలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది బీఆర్ఎస్. చాలా గ్రామాల్లో రైతులు కూడా బ్యాంకుల దగ్గర ఆందోళనలు చేస్తున్నారు.

రైతుల నిరసనలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నష్ట నివారణ చర్యలకు దిగింది. బ్యాంకర్ల తప్పుల కారణంగానే రుణమాఫీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆ తప్పులను సరిదిద్ది 42 లక్షల మంది రైతు కుటుంబాలకు 31 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ఐదేండ్లలో పంట రుణాల వివరాలు ఇవ్వాలని 40 బ్యాంకులను కోరితే, 41 లక్షల78 వేల 897 మందికి 31 వేల కోట్లు రుణాలు ఇచ్చినట్లు రిపోర్ట్​ ఇచ్చారని, దాని ఆధారంగానే ముందుకు వెళ్తున్నామన్నారు.ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల అకౌంట్లలో 18 వేల కోట్ల రూపాయలు జమ చేశామన్నారు.

మూడు బ్యాంకుల్లో డేటా మిస్ కావడం వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, వారందరి వివరాలు తీసుకుంటున్నామన్నారు మంత్రి తుమ్మల. తెల్లరేషన్​ కార్డు ఉన్న వారికి ఇప్పటికే డబ్బులు జమయ్యాయని, కార్డు లేని వారికి కుటుంబ నిర్ధారణ చేసి, మాఫీ చేస్తామన్నారు.2 లక్షలకు పైబడి క్రాప్​ లోన్లు ఉన్నవాళ్లు.. మిగితా బ్యాలెన్స్​ బ్యాంకులకు చెల్లిస్తే 2 లక్షల రూపాయలను వాళ్ల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు.ఇందుకోసం త్వరలోనే గైడ్​లైన్స్ ​ఇస్తామన్నారు.

Read More : సినిమా యాక్టర్ల బిల్డింగులు‌ కూల్చేస్తం..

సాంకేతిక లోపాల కారణంగా 2 లక్షల 26 లక్షల మందికి సంబంధించిన 24 కోట్లు రిటర్న్ వచ్చాయని తెలిపారు. లోన్లు మాఫీ అయ్యాక వెంటనే బ్యాంకర్లు రైతులకు మళ్లీ అప్పులు ఇవ్వాలని ఆదేశించినట్టు మంత్రి తుమ్మల తెలిపారు.రేషన్ కార్డు లేని వారి కుటుంబాన్ని నిర్ధారించేందుకు ఈ నెల16వ తేదీ నుంచి అధికారులు, లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పరిశీలిస్తున్నారని మంత్రి తుమ్మల చెప్పారు. సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతుల ఇండ్లకు కూడా వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుంటున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 46 లక్షల ఖాతాలకు 16 లక్షల ఖాతాలకి 11 వేల కోట్లు మాత్రమే జమ చేసిందని తుమ్మల వెల్లడించారు.

Read More : మహిళా కమాండోను నరికి చంపిన మావోయిస్టులు

తాము ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తుండడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి తుమ్మల అన్నారు. వారి ఉచ్చులో చిక్కుకోవద్దని రైతులకు సూచించారు. అధికారంలో ఉన్న పదేండ్లు రైతుల పేరెత్తని ట్విటర్ ​లీడర్​ కేటీఆర్ ఇప్పుడు రైతుల జపం చేస్తున్నారన్నారు.

Back to top button