తెలంగాణ

రిజిస్ట్రేషన్‌కు 5 లక్షలు.. 3 రోజులకే కూల్చేశారు.. ఇదేం ఘోరం హైడ్రా

హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదమవుతున్నాయి.బడాబాబులను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అమీన్ పూర్ కిష్టారెడ్డి పేటలో హైడ్రా పలు భవనాలను కూల్చేసింది. అయితే ఇండ్లు కోల్పోయిన బాధితుల కథ చూస్తే గుండె తరుక్కుపోతోంది. కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది.

రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజులకే తన ఇంటిని నేలమట్టం చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తోంది. రూపాయి రూపాయి పోగు చేసిన డబ్బుతో పాటు బ్యాంక్ లోన్ తీసుకున్ని ఇళ్లు కొన్నామని.. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ జరిగిందని ఆ కుటుంబం చెబుతోంది. రిజిస్ట్రేషన్ కు 5 లక్షల ఫీజు కూడా కట్టామని చెప్పారు. అక్రమ నిర్మాణం అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేశారని నిలదీస్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీ 5 లక్షలు వసూల్ చేసి… మళ్లీ మూడు రోజులకే అక్రమ నిర్మాణమని కూల్చడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే అధికారే కనిపించడం లేదు.

నేలమట్టం అయిన మరో ఇంటికి మామిడాకులు కూడా అలాగే ఉన్నాయి. వారం క్రితమే గృహ ప్రవేశం చేశారు. ఇప్పుడు స్మశానం అయింది.మూడు సంవత్సరాల నుండి రూపాయి రూపాయి కూడా పెట్టి కట్టుకున్న ఇల్లును నిమిషాల్లో కూలగొట్టారని ఆ ఇంటి బాధితుడు గొల్లుమంటున్నాడు.పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే.. కూల్చేది వాళ్ళే.. చంపడం కూడా వాళ్ళే అయితే బాగుండు.. మమ్మల్ని చంపమనండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అన్ని కరెక్ట్ గా ఉన్నా ఎందుకు కూల్చారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నాకు 70 లక్షల అప్పు ఉంది ఎవరు తీరుస్తారని అన్నారు. వాళ్లే రిజిస్ట్రేషన్ చేస్తారు.. వాళ్లే కూల్చేస్తారు ఇదెక్కడి న్యాయమంటూ బోరుమంటున్నారు బాధితులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button