తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14, 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న నైపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్న ట్లు సీఎంవో వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. ఈనెల 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అయితే రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దుపై మరో ప్రచారం సాగుతోంది. హైకమాండ్ సీరియస్ కావడం వల్లే సీఎం రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. అదానీ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన పెట్టుకున్నారని.. దాని కప్పిపుచ్చుకునేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిశీలన అని కవరింగ్ స్టెట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు. దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది.
గతంలో అదానీతో రేవంత్ డీల్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. హైకమాండ్ సీరియస్ కావడంతో స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్ల రూపాయల విరాళాన్ని తిరిగి ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా అదానీతో రేవంత్ డీల్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన కూడా అదానీ కోసమే పెట్టుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో హైదరాబాద్ వచ్చిన రాహుల్ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్.. సీఎం రేవంత్ కు మరోసారి క్లాస్ పీకారని చెబుతున్నారు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నారని అంటున్నారు.
ఉన్న ఫలంగా ఆస్ట్రేలియా పర్యటన రదైతే ప్రజల్లో అనుమానాలు వస్తాయి కాబట్టి.. ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసమని ప్రకటన చేశారని అంటున్నారు. అయితే ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవం షెడ్యూల్ ఆరు నెలల క్రితమే విడుదల అయింది.. ఈ విషయం ఎవరికైనా తెలియకుండా ఉంటుందా…