
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా రాజా సాబ్ . ఈ సినిమా లో ప్రభాస్ తో పాటుగా హీరోయిన్ మాళవిక మోహన్, నిధి అగర్వాల్ మరో ఇద్దరు హీరోయిన్లు కొన్ని పాత్రలలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కీలక అప్డేట్ అందించారు. రాజా సాబ్ సినిమాకు సంబంధించి పార్ట్ 2 కూడా ఉంటుంది అని స్పష్టం చేశారు. అయితే సినిమా జోనర్ వేరే ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. తాజాగా రాజా సాబ్ సినిమా రిలీజ్ విషయంలో కాస్త లేట్ అవుతుండడం.. వాయిదా ఎందుకు పడుతుంది అనే ప్రచారంపై స్పందించారు. ఇందులో భాగంగానే తెలుగు ఆడియన్స్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయాలని కోరుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. కాకపోతే డిసెంబర్ నెలలో అయితే హిందీ మార్కెట్ కు చాలా అనుకూలిస్తుందని అన్నారు. అందుకే ఈ విషయంపై మళ్ళీ కూడా ఆలోచిస్తామని తెలిపారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదలవుతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కానీ తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా జనవరి టైంలో అంటే సంక్రాంతి సమయంలో రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా కూడా ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమాలు నేడు ప్రపంచ స్థాయిని చాటుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి మన టాలీవుడ్ ఎదిగింది అని అనడంలో ప్రభాస్ అలాగే డైరెక్టర్లు రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటివారు కొంచెం ముందంజలో ఉంటారు.
Read also : దేవుడు మీద ఒట్టు!.. నేనే తప్పు చేయలేదండి.. అంటూనే సూసైడ్?
Read also : Ajit Doval: ట్రంప్ సుంకాల బెదిరింపులు..అజిత్ దోవల్ రష్యా టూర్!