క్రైమ్తెలంగాణ
Trending

రక్షకులే యమ బక్షకులై…. బాధితురాలిని చంపెయ్యమంటూ ఓ పోలీస్ అధికారి సూచన..?

నల్లగొండ జిల్లాలోని ఒక మండలంలో కీచక పోలీస్ దుర్మార్గం.. ఆడియో లీక్ తో ఉల్లిక్కిపడిన బాధిత బంధువులు..

రక్షించే పోలీసులే ప్రాణం తియ్యాలన్న మాటలకు, పోలీస్ వ్యవస్థ తలదించుకునే పరిస్థితి…

తెలంగాణ డిజిపికీ నల్గొండ ఎస్పీ కి ఆడియోను చేరవేసే దిశగా బాధితులు

ప్రజలకు సేవ చెయ్యాల్సిన పోలీసులే ఇలా లంగా సలహాలు ఇవ్వటం పై ప్రజలు ఫైర్..

తప్పు చేస్తే లాటిలతో లూటి చేసే పోలీసులు నేడు మర్డర్లకు సలహాలు ఇచ్చే స్థాయిపై తీవ్ర విమర్శలు.

చంపితే 307 అవుతుంది…దానికి ఎందుకు బయపడుతున్నావు… పదిమంది పోరగాళ్ళను మాట్లాడి ఖతం పెట్టు…!?

ఇలాంటి వాళ్లుకు ఉద్యోగాలు ఇస్తే ఇలానే ఉంటుంది పోలీసులపై ప్రజా సంఘాల ఫైర్..

నల్లగొండ జిల్లా ప్రత్యేక ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): రక్షించే పోలీసులే బక్షించే కార్యక్రమం ముందేసుకున్నట్లు అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే…న్యాయం చెయ్యమని వెళ్ళిన వారి ప్రాణాలకే రేటు కట్టిన ఓ పోలీస్ అధికారి మాటలు సమాజం తలదించుకునేలా చేసింది.. ఈ గొడవంతా దేనికి పదిమంది పోరగాళ్ళను పెట్టు, ఒక లక్ష రూపాయలకే చంపేస్తారంటూ మాట్లాడిన ఆ పోలీస్ పై ప్రజా సంఘాలు గుర్రుమంటున్నాయి.. పాము తన పిల్లలనే తాను తింటుందనే మాదిరిగా బుద్ది లేని ఓ పోలీస్ మాట్లాడిన మాటలు యావత్ డిపార్ట్మెంట్ తలదించుకునే పరిస్థితిని తెచ్చింది..

ఇక వివరాలలోకి వెళ్తే నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ మండలంలో జరిగిన ఇద్దరి మధ్య గొడవ చిలికిచిలికి చివరికి గాలి వానలా మారింది.. ఈ ఇద్దరి మధ్య గొడవలో తల దూర్చిన ఆ మండలం పోలీస్ అధికారి, అవతలి వర్గపు పెద్ద మనిషితో, ఏ ఇవ్వనీ వద్దు ఖతం పెట్టమని సలహాలు ఇవ్వడంపై దుమారం లేస్తుంది.. ఇంత ఖర్చు పెట్టుకున్నావు నా మాట విని ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పది మంది పోరగాళ్ళను మాట్లాడు, చిటికలో పని ముగిస్తారు… మహా అంటే 307 అవుతుంది, దీనికి కేవలం ఒక నెల మాత్రమే జైలు శిక్ష, తరువాత వారు నీ జోలికి కూడా రారు, నా మాట విను అంటూ చేసిన అతగాడి మాటలకు జనం అతడి నోట్లో ఉమ్మాలన్న కసితో ఉన్నారు..

ఈ తీస్మార్ మాట్లాడిన కతంతా రికార్డు చేసుకున్న అవతలి వ్యక్తి నుండి ఆడియో లీక్ కావడంతో వారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు..తమ పెద్ద సారును కలిసి ఇంత ఇస్తాను అని తానే నేరుగా మాట్లాడి, బేరం తెగ్గొడితే సరిపోతుందని, నేను ఉన్నాగా టెన్షన్ పడకంటూ మాట్లాడిన ముచ్చటంతా క్రైమ్ మిర్రర్ చేతికి రావడంతో ఖంగు తిన్నారు పోలీసులు.. పవిత్రమైన వృత్తిలో కొనసాగుతూ, నీచపు సలహాలు ఇస్తున్న ఆ బట్టెబాజ్ ని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని కోరుతున్నారు మండల ప్రజలు.. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ అంశంపై ఎలా స్పందించనున్నారో చూడాల్సి ఉంది.. ఎవిడెన్స్ ని తెలంగాణ రాష్ట్ర డీజిపి కి చేరవేసే దిశగా క్రైమ్ మిర్రర్ పాటుపడుతుంది.. పూర్తి వివరాలు, అతని వెనుక ఉండి నడిపిస్తున్న పెద్ద సారుపై మరో క్రైమ్ మిర్రర్ కధనంలో స్పెషల్ స్టోరీ ద్వారా మీ ముందుకు..

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది…

Related Articles

Back to top button