ఆంధ్ర ప్రదేశ్

రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. భారీగా వరద సాయం

తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద విలయం అంచనాలకు మించి కనిపిస్తోంది. వర్షాలు తగ్గడంతో క్షేత్రస్థాయిలో తిరుగుతున్న అధికారులకు ఎక్కడ చూసినా హృదయవిదారక పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. వర్షాలు తగ్గి రెండు రోజులవుతున్నా విజయవాడ ఇంకా వరదలోనే ఉంది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ వరద నష్టం భారీగా ఉంది. తెలంగాణలో దాదాపు 5 వేల నష్టం జరిగిందని ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఏపీలో జరిగిన నష్టం అంచనాలకు అందకుండా ఉంది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.

వరద బాధితులకు సాయం చేయాలని ప్రభుత్వాలు కోరడంతో దాతలు ముందుకు వస్తున్నాయి. దేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ, తెలంగాణకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ నుంచి మొదటగా జూనియరే ఎన్టీఆరే విరాళం ప్రకటించారు. వైజయంతి మూవీస్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి 25 లక్షల సాయం ప్రకటించారు. జూనియర్ బాటలోనే టాలీవుడ్ మిగితా హీరోలు వరద సాయం ప్రకటించబోతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని ఎన్టీఆర్ ట్విట్టర్ X లో పోస్ట్ చేశారు.

Back to top button