తెలంగాణ

యువత సన్మార్గంలో నడుచుకోవాలి…-వెంకటాపూర్ ఎస్సై జక్కుల సతీష్

  • చెడు వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దు

క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప): యువత సన్మార్గంలో నడుచుకోవాలని, చెడు వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని వెంకటాపూర్ ఎస్సై జక్కుల సతీష్ అన్నారు. ములుగు జిల్లా ఎస్పీ శభరిష్ ఆదేశాల మేరకు ఆయన బుధవారం మండలంలోని రామాంజపురం గ్రామంలో గల యువతకు అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్సై జక్కుల సతీష్ మాట్లాడారు.. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి పిల్లలను చదివించాలని అనుకుంటారని, అలాంటి తల్లిదండ్రుల కోసమైనా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.

గుడుంబా, గుట్కా, గంజాయి నిషేదిత వస్తువులని అలాంటి వాటికి తప్పకుండ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిషేధం ఉన్న వస్తువులు ఎవరైనా అమ్మిన, కొనుగోలు చేసిన చాటరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలపై యువతను అడిగి తెలుసుకున్నారు.

Back to top button