మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం, హీరో మోహన్ బాబు అరెస్ట్ పై రాచకొండ సిపి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు కుటుంబంపై 3 FIRలు నమోదు అయ్యాయని చెప్పారు.ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని.. లీగల్ గా ఏమి చేయాలో చేస్తామని తెలిపారు.నమోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదన్నారు. నోటీసు ఇచ్చామని.. 24 వరకు టైం అడిగారని సీపీ తెలిపారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మోహన్ బాబును అరెస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
మోహన్ బాబు విచారణపై తాము కూడా కోర్టు వెళతామన్నారు. మళ్ళీ నోటీసు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ కావాల్సిందేనని.. లేదంటే వారెంట్ ఇష్యూ చేస్తామని రాచకొండ సీపీ తేల్చి చెప్పారు.పోలీస్ కమిషనర్ ప్రకటనతో జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో హీరో మోహన్ బాబును అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరికి వెళ్లిన మోహన్ బాబు.. అక్కడి స్టేషన్ లో తన గన్ సరెండర్ చేశారు. అయితే మోహన్ బాబు దగ్గర మరో గన్ ఉందని తెలుస్తోంది.