
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు 20 మంది చిలుకూరు ఆలయానికి వెళ్లి రంగరాజన్ పై దాడి చేశారు. రామరాజ్యం ఆర్గనైజేషన్ కు చెందిన 20 మంది దాడి చేశారని గుర్తించారు. రామరాజ్యం సైన్యం అధ్యక్షుడు వీరశేఖర్ రెడ్డి తన టీంతో వచ్చి రంగరాజన్ పై దాడి చేశారు. రంగరాజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీరశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. రంగరాజన్ పై ఎందుకు దాడి చేశారన్న చర్చ సాగుతోంది. అయితే తాజాగా రంగరాజన్ పై దాడికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. Feb 2 ఆదివారం నాడు పాతబస్తీలో ఏర్పాటు చేసిన ముస్లిం సభకు వెళ్ళారు రంగరాజన్. చిలుకూరు ప్రధాన అర్చకులు స్థానంలో ఉండి ఓ మతం సమావేశానికి ఎలా వెళ్తాడు అంటూ ప్రశ్నిస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ కారణంతోనే రామరాజ్యం సంస్థ వాళ్లు రంగరాజన్ పై దాడి చేశారని తెలుస్తోంది.
ఒక దేవాలయానికి రాజుగా ఉండి మరో మతస్థలానికి వెళ్లి పొగిడడం ఎక్కడి న్యాయమనే ప్రశ్నలు హిందూ సంఘాల నుంచి వస్తున్నాయి. గతంలో కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో ఒక మజీద్ ఇష్యూ వస్తే.. మాకు
అభ్యంతరం లేదు మజీద్ కట్టుకోవచ్చని రంగరాజన్ చెప్పాడని అంటున్నారు. అయితే స్థానిక హిందూ సంఘాల సభ్యులు వ్యతిరేకించడంతో మజీద్ విషయంలో రంగరాజన్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది.