తెలంగాణ

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొంటారు. ఎన్నికల మ‌హా ఎన్నిక‌ల ప్రచారంలో అధిష్టానం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించింది.

తెలంగాణలో పాలన అస్తవ్యస్థంగా తయారైందనే విమర్శలు పెరుగుతుండగానే మంత్రుల తీరు మాత్రం మారడం లేదు. విదేశీ పర్యటనల్లో బిజిబిజీగా ఉంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉండగా.. అందుబాటులో ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు తప్ప ఉండటం లేదు. విదేశీ టూర్లకు క్యూ కడుతున్నారు మంత్రులు. ఒకరిద్దరు వెళ్లి రాగానే మరో ఇద్దరు, ముగ్గురు వెళుతున్నారు. ఇటీవల కాలంలో దాదాపుగా అందరూ మంత్రులు ఫీల్జ్ పర్యటనల పేరుతో దేశాలన్ని చుట్టేసి వస్తున్నారు. ప్రస్తుతం మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు మలేషియా పర్యటనలో ఉన్నారు.

మిగిలిన మంత్రుల్లోనూ సగం మంది మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మంత్రి సీతక్క గత నాలుగు రోజులుగా జార్కండ్ లో ఎన్నికల ప్రచారం చేశారు. మరో మూడు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొంటారు. ఎన్నికల మ‌హా ఎన్నిక‌ల ప్రచారంలో అధిష్టానం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించింది. మహారాష్ట్రలో ఇత‌ర రాష్ట్రాల సీఎంల‌తో క‌లిసి రేవంత్ రెడ్డి విలేక‌రుల స‌మావేశంలో పాల్గొంటారు.

మ‌రోవైపు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్కను అధిష్టానం జార్కండ్ లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొనేందుకు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించింది. ఆయ‌న కూడా జార్ఖండ్ వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొంటారు. మరో ముగ్గురు మంత్రులు కూడా కేరళలోని వయనాడ్ తో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. దీంతో పాలన మరింత పడకేస్తోంది. సచివాలయంలో మంత్రులెవరు అందుబాటులో ఉండటం లేదని ఐఏఎస్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనంతో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో జల్సా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

ప్రయాణికుడి దగ్గర బుల్లెట్లు.. ఎయిర్ పోర్టులో కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button