ఆంధ్ర ప్రదేశ్

మీడియా ముందే ఎక్కి ఎక్కి ఏడ్చిన షర్మిల..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా చూడనటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. కన్నతల్లి అలాగే చెల్లిపై కేసు పెట్టిన ఏకైక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి నిలిచాడు. ఆస్తి తగాదాల్లో భాగంగా కన్నతల్లిని అలాగే చూడబుట్టిన చెల్లిని కోర్టు మెట్లు దాక లాగిన జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ జరుగుతుంది.

ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల మీడియా సమావేశంలో మీడియా ఎదురుగానే కంటతడి పెట్టుకున్నారు. ఎవరైనా సరే కన్నతల్లి పై అలాగే తోడబుట్టిన చెల్లి పై కేసులు పెడతారా…? నాకు అలాగే నా బిడ్డలకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేస్తున్నాడు అనేది పచ్చి నిజం అని కంటతడి పెట్టుకుంటూ మరీ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది. అలాంటి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ క్యాడర్ భరిస్తూ మోస్తుంది. నాకు గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నేను మాత్రం MOU లను బయట పెట్టలేదు.

జగన్ ఎన్ని అరాచకాలు చేసినా కానీ ఇప్పుడు కూడా నేను ఇంటి సమావేశాలను మాత్రం బయట పెట్టలేదు. ఆ కుటుంబం నుంచి ఎటువంటి బ్యాడ్ న్యూస్ వచ్చినా అది నాకు కూడా చెందుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా అలాగా ప్రవర్తించలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నాపై అలాగే నాకన్నా తల్లిపై ఇంతటి ఘోరానికి పాల్పడతాడని బాధతో చెప్పింది. ఇలా తన బాధను మొత్తం మీడియా ముందు వెల్లడించింది షర్మిల.

Back to top button