క్రైమ్

మాల్ ఆసుపత్రిలో బాలుడి మరణం.. గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్..!?

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం పరిధిలోని మాల్ టౌన్ నందు ఓ ఆసుపత్రి నందు, ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందినట్లు వినికిడి..!? వైద్యం కోసం వచ్చి మృత్యు ఒడిలో చేరుకున్నట్లు, ఇదంతా కొంతమంది పెద్ద మనుషుల నేతృత్వంలో గంప కమ్మినట్లు తెలుస్తుంది..!? ఈ విషయంలో ఓ అధికారి, ఓ ప్రధాన ఆసుపత్రి యజమాని దగ్గరుండి క్లోస్ చేసినట్లు తెలుస్తుంది..

మృతికి గల కారణాలు, బాలుడికి ఉన్న అనారోగ్యం ఏంటనేది తెలియాల్సి ఉంది. వైద్యం వికటించడం వల్లే మరణించాడా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అంశాలపై క్లారిటీ రావలసి ఉంది.. ఈ అంశం తెరపైకి రాకుండా రెండేసి కాసులతో, పేపర్ పై నగదుతో మభ్యపెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..!? ఏదేమైనా అసలు విషయాలు బయటికి రావలసిన అవసరం ఉంది..

రేపటి సంచికలో ఆ బాధ్యత గల అధికారి, ఓ ఆసుపత్రి పెద్ద మనిషి పూర్తి వివరాలు మీ ముందుకు…

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..

Back to top button