జాతీయం

మహిళా కమాండోను నరికి చంపిన మావోయిస్టులు

క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్ : మావోయిస్టులు కోవర్టు అనే అనుమానంతో మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చారు. రాధా అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మావోయిస్టు పార్టీ మరణశిక్ష విధించింది. పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి శత్రువు అనుసరిస్తున్న కోవర్టు ఎత్తుగడల్ని తిప్పికొడతామని.. పోలీసుల కోవర్టు కుట్రలో భాగమైన విప్లవ ద్రోహిగా మారినందుకు నీల్సో రాధను చంపేసామని మావోయిస్టులు నోట్ విడుదల చేశారు.

Read More : జనంలోకి కేసీఆర్.. ముహుర్తం ఫిక్స్.. ఆయనకు చుక్కలే!

పోలీసులకు లొంగిపోయి పూర్తిగా రాధా సోదరుడు సూర్యం ఏజెంట్ గా పని చేస్తున్నాడంటూ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. రాధాపై అనుమానం రావడంతో 3 నెలల క్రితం కమాండర్ బాధ్యత నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ, ఛత్తీస్గడ్ ఇంటలిజెన్స్ అధికారులతో సంబంధం పెట్టుకున్నట్లు మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రాధా ద్వారా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులకు వెల్లడించిందని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. పార్టీ నిర్ణయం మేరుకే రాధాకు మరణశిక్ష విధించామని తెలిపింది.

Back to top button