తెలంగాణ

ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించిన తెలంగాణ యువకుడు !.. కానీ ప్రభుత్వం నుండి నో సపోర్ట్?

ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లా అడ్డగూడూరు గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ పనికెర నాలుగు గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టాడు. మాములు నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన క్రాంతి తన ప్రతిభతో ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా తనకున్న ప్రతిభతో దేశం గర్వించేలా చేయటం గొప్ప విషయం. 60 సెకన్ల లో 57 ఫ్యాన్లు నాలుకతో ఆపటం, గొంతులో కత్తులు దింపుకుని 1,944 బరువును 5 మీటర్లు లాగటం, 360 డిగ్రీల మరుగుతున్న వేడి నూనె లో 17 చికెన్ ముక్కలు తీయటం, 60 సెకన్లలో ముక్కు లోపలికి 22 మేకులు దింపుకోవటం వంటి విన్యాసాలతో ఒకేరోజు నాలుగు గిన్నిస్ రికార్డులు తన పేరున లిఖించుకున్నాడు.

కాంగ్రెస్ నేతలను తరిమికొట్టండి.. కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు

దేశ చరిత్రలో ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్స్ గ్రహీత క్రాంతి డ్రిల్ మ్యాన్ మాట్లాడుతూ మరిన్ని రికార్డులు సాధించి దేశం గర్వించేలా చేస్తానని, అందుకు ప్రభుత్వం నుండి చేయూత అవసరం ఉందని అన్నారు. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరంగా ఉందని తెలిపారు.

మరో వైపు గిన్నిస్ ప్రతినిధులు ఎక్స్ లో విడుదల చేసిన క్రాంతి డ్రిల్ మ్యాన్ విన్యాసాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మిలియన్స్ లో వ్యూస్ పొందుతున్నాయి. క్రాంతి చేస్తున్న సాహసాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సహాయ, సహకారాలు అందిస్తే మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని క్రీడాకారులు, క్రీడా అభిమానులు కోరుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో 40 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్!

గ్రామాలకు పోతే తంతరనే అప్పు తెచ్చి రైతు భరోసా!

Back to top button