తెలంగాణ

మళ్లీ కుండపోత వర్షం.. వణుకుతున్న జనం

తెలంగాణను వర్షం వదలడం లేదు. గత ఐదు రోజులుగా కురుస్తున్నవర్షాలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్థమైంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. చెరువులు కూడా దాదాపుగా 90 శాతం నిండుకుండలా మారాయి. వరదలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలోనే మరో ముప్పు ముంచుకొచ్చింది. మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలో అత్యంత బారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్. ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి తెలంగాణలోని రికార్డ్ వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణలోని పలు జిల్లాలో కుండపోత వర్షం కురిస్తింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కోహెడలో అత్యధికంగా 22 సెం.మీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ లో 19 సెంటీ మీటర్లు, నిమాజామాద్ లో 16 సెం.మీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. మరోవైపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అతి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, పలు లోతట్టు కాలనీలలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఇండ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై వరదనీటిలో వెళ్లడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల క్రింత కుండపోత కురవడంతో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆ ప్రాంతాల్లోనూ మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వరద బాధితులు వణికిపోతున్నారు. ఇక హైదరాబాద్ సహా శివారు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

Back to top button