మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ బాత్ రూముల్లో వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐదుగురిని అదుపులోకి తసుకొని విచారిస్తున్నారు పోలీసులు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్‌చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అర్థరాత్రి విద్యార్థినిలు ఆందోళన చేయడంతో..పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డే బాధ్యత వహించాలని హెచ్చరించారు.