
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ :-మునుగోడు నియోజకవర్గము, మర్రిగూడ మండలం, తమ్మడ్‌పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి మునుగోడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, “డా. అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమాన హక్కులు లభించాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమానస్థానం కల్పించే దిశగా మనం ముందుకు సాగాలి” అని అన్నారు.ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో ముచ్చటించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.
జగన్‌కు సొంత పార్టీ నుంచే వెన్నుపోట్లు – టీడీపీతో కలిసి వైసీపీ ఓటమికి ప్లాన్లు