తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మంత్రికి సంబంధించిన పర్సనల్ వీడియోలు లీక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రి కొండా సురేఖ నివాయంలో బీర్లు, బిర్యానీల పార్టీ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి. వీడియోలతో సహా బుక్కయ్యారు మంత్రి సురేఖ.
మన ఇంట్లో ఈరోజు మందు ఏరులై పారుతుంది.. బిర్యానీ ఉన్నప్పుడు బీర్లు ఉండాలి కదా.. అక్కడ వరంగల్లో కొండా మురళి మందు ఏరులై పారిస్తున్నాడు ఇక్కడ నేను పారిస్తున్న అంటూ ఆ వీడియోలో లైవ్ లో మాట్లాడారు కొండా సురేఖ. ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని చెప్తున్న.. ఒక బిర్యానీ అయితుంది, ఇంకోవైపు తాగుడు ఆయితుంది అని ఆమె మరో మహిళతో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. మనం కూడా తాగుడు నేర్చుకుంటే ఐపోవు అని కొండా సురేఖ అన్నారు. ఈ వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.