Tuesday, February 24, 2026
Homeతెలంగాణభూమిలో నుంచి పొగలు.. హైదరాబాద్ KBR పార్క్ దగ్గర కలకలం

భూమిలో నుంచి పొగలు.. హైదరాబాద్ KBR పార్క్ దగ్గర కలకలం

హైదరాబాద్ లో విచిత్ర ఘటన జరిగింది. వాహనదారులకు భయపెట్టించింది. జనాలను గందరగోళానికి గురి చేసింది. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర భూమిలో నుంచి పొగలు వచ్చాయి. మొదట కొద్దిగా వచ్చిన పొగలు క్రమక్రమంగా పెద్దగా అయ్యాయి. అక్కడ ఎలాంటి మంట లేదు. భూమి పొరల్లో నుంచి పొగలు వచ్చాయి. ఓ వైపు వర్షం కురుస్తుండగా తడిగా ఉన్న భూమిలో నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం అందరిని షాక్ కు గురి చేసింది.

భూమిలో నుంచి పొగలు రావడం చూసి వాహనదారులు భయాందోళనకు గురుయ్యాకు. కొందరు భయంతో పరుగులు పెట్టారు. మరికొందరు పొగలు వచ్చే ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వర్షం కురుస్తుండగానే నీళ్లపైనే పొగలు రావడం చూసి అవాక్కయ్యారు. ఏం జరిగిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. అటుగా వెళ్లే వాహనదారులంతా ఈ పొగలు చూసేందుకు ఎగబడ్డారు. హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసిన కాసేపటికే ఇది జరిగింది.కేబీఆర్ పార్క్ దగ్గర భూమిలో నుంచి పొగలు వస్తున్న వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments