తెలంగాణ

బీసీల గొంతుక తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసిన రెడ్లు!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొంత కాలంగా బీసీ గళం బలంగా వినిపిస్తున్నారు. అధికార పార్టీ నేతగా ఉన్నా బీసీల కోసం గట్టిగా పోరాడుతున్నారు. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. తనకు పదవుల కంటే బీసీలే అభ్యున్నతే ముఖ్యమంటున్నారు తీన్మార్ మల్లన్న. డీఎస్సీలో రిజర్వేషన్ల వల్ల నష్టపోయిన బీసీ అభ్యర్థులతో మాట్లాడుతూ.. అగ్రవర్గాలను ఉతికి ఆరేస్తున్నారు. గ్రూప్ 1 జీవో 29 వివాదంలోనూ అధికార పార్టీ నేత అయినా బీసీల వైపు నిలబడ్డారు తీన్మార్ మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డి తీరు బహిరంగంగానే ఎండగట్టారు. బీసీల కోసం ఎందైనా వెళతానని చెప్పారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు తీన్మార్ మల్లన్న.

బీసీ హక్కుల కోసం పోరాటంలో రెడ్డి నేతలను తూర్పురాబడుతున్నారు తీన్మార్ మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. తనకు రెడ్ల ఓట్లు అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. తీన్మార్ మల్లన్న వాయిస్ జనంలోకి వెళుతుండటంతో బీసీల్లో ఆయనకు మద్దతు పెరుగుతోంది. తమకు సరైన నాయకుడు దొరికాడనే భావనలో బీసీ వర్గాలు కనిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్నతో తమసు ఎసరు వచ్చేటట్టుందని గ్రహించిన రెడ్లు.. ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.వ్యక్తిగతంగా తిడుతూ ట్రోల్ చేస్తున్నారు రెడ్లు.

తాజాగా తీన్మార్ మల్లన్నను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ ఓ సీనియర్ రెడ్డి జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతంలో తీన్మార్ మల్లన్నతో కలిసి పని చేసిన సదరు జర్నలిస్ట్.. ఇప్పుడు మాత్రం మల్లన్నకు బ్లాక్ మార్ అంటూ టార్గెట్ చేశాడు. రెడ్లను మల్లన్న తిడుతుండటం వల్లే సదరు జర్నలిస్ట్ ఈ పోస్టు పెట్టారనే టాక్ వస్తోంది. తన పోస్టులో బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అంటూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. రేవంత్ ది పెద్దగా ఉంటుంది అంటూ మోకాళ్ల పై కుర్చున్న బ్లాక్ మెయిల్ వదురుబోతుగా చెప్పుకుంటున్న నీవ్వు. ఇప్పుడు మరో వాదంతో మంత్రి పదవి బ్లాక్ మెయిల్ చేయడం లేదా..? నీవ్వు ప్రజాపతినిధిగా 6 నెలలు అవుతుంది కదా..? మాటల్లో కాకుండా చేతల్లో ఎంత మంది బీసీలను ఉద్దరించావు అంటూ టార్గెట్ చేశాడు.

నీ బ్లాక్ మెయిల్ బ్లాక్మార్ మరకల దందా ఎంత పెంచుకున్నావు. వినే వాడు ఉంటే అంగిలాగు, బొంగు బోషానం అని చెప్పే నీవ్వు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సెటిల్మెంట్స్ ఎన్ని.. ? వాటితో నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల సంపద ఎలా అప్పర్ కులాలకు పంచావో తెలియదా..? వాటాలు ఇస్తేనే పని చేస్తారని ఎంత మందికి చెప్పావో…? నీ మంత్రి పదవి కోసమే బీసీ వాద రాజకీయం అని తెలిదనుకుంటున్నావా.. నీకు మంత్రి పదవి ఇస్తేనే బీసీనా.. ఇప్పటి వరకు బీసీలు ఎప్పుడు మంత్రులు కాలేదా..? నీ రాజకీయ భవిష్యత్తు కోసం వాగుడు మానుకో.. అంటూ సదర్ రెడ్డి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను హెచ్చరించాడు. నీలా అబద్దాలు, బ్లాక్మార్ మాటలు వలన అందరికి నష్టమే.. ? నువ్వో బ్లాక్మార్ గానివి అని గుర్తు పెట్టుకో.. కులాలను అడ్డుపెట్టుకుని డబ్బులు , అధికారం సంపాదించెందుకు బ్లాక్ మెయిల్ చేసే వాన్ని బ్లాక్మార్ అంటారని నీ స్నేహితునిగా నేను నీకు పేరు పెడుతున్నా అంటూ పోస్ట్ చేశాడు.

Back to top button