అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐరేళ్లుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్న జేసీ.. తాజాగా రూట్ మార్చారు. జగనే నయమన్నట్లుగా మాట్లాడారు. అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. బస్సులు తగలబడిన ఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.
తాడిపత్రిలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ వాళ్లలాగా జగన్ బస్సులు తగలబెట్టలేదు.. ఆపినాడు అంతే అన్నారు. కానీ మీరు తగలబెట్టారు.. మీ కంటే జగన్ రెడ్డే మేలు కదరా అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నా 300 బస్సులు ఆపితేనే ఏడ్చలేదు.. ఇప్పుడు ఎందుకు భాదపడతా అన్నారు. బస్సులు ఇంకా ఉన్నాయి.. కాల్చుకోపోండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.