క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మండలంలోని పాలంపేట గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు పైడాకుల మల్లేష్ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లేష్ మాట్లాడుతూ.. పుట్టినరోజు యువతపై అత్యంత ప్రభావాన్ని చూపిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద అని, అందుకే ఆ మహానుభావుడి పుట్టిన రోజును ఏటా “జాతీయ యువజన దినోత్సవం” గా నిర్వహించుకుంటున్నామని అన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళపై గ్యాంగ్ రేప్!
ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని ఒక వ్యక్తిలో కలిగించడం కన్నా మించిన సాయం లేదని చెప్పిన మహానుభావులు వివేకానంద అని, ఈ రోజు నిరాశ, నిస్పృహలతో, మత్తు పదార్థాల బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న యువతలో బలమైన ఆత్మవిశ్వాసం కలిగించడమే మన ముందున్న కర్తవ్యం కాబట్టి ఇందుకు వివేకానంద స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందుకోవాలని, విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతో పాటు సామాజిక బాధ్యతను, స్వావలంబనను పెంపొందించాలని అన్నారు. వివేకానంద 39 సం.లకే చనిపోయారని కాని వారి ఆశయాలు మాత్రం ఎప్పటికి యువత, ప్రజలలో నిలిచిపోయే విధంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా కష్టమే!..
అనంతరం బీజేపీ మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పైడాకుల మల్లేష్ ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారుబోతుల యాదగిరి గౌడ్, పత్తి నాగేశ్వరావు, కొత్త వీరస్వామి, కాసర్ల సురేష్, కంచు కుమారస్వామి, కవ్వల శ్రీనివాస్, పెరిక ధర్మయ్య, ఒద్దుల రాందాస్, గూడబ్ సంతోష్, బెల్లంకొండ వినోద్, శాతరాజు విక్రాంత్, కన్నబోయిన నాగరాజు, జాటోత్ ధరమ్ సింగ్, బంటు మొగిలి, జంబల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.