తెలంగాణ

బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో కొత్త రూల్స్

వినాయక చవితి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది హైదరాబాద్. దేశంలో ముంబై నగరంతో పాటు భాగ్యనగరంలోనే గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమ్మజన శోభాయాత్ర చాలా ఫేమస్. ఈ వేడుకను చూసేందుకు దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించవచ్చు.

హైదరాబాద్ లో వినాయ చవితి వేడుకలు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణనాథుడు. ఆ తర్వాత అంతే ఫేమస్ బాలాపూడ్ వినాయక లడ్డూ. ఖైరతాబాద్ మహా గణపయ్య శోభాయాత్రకు ఎంత క్రేజీ ఉంటుందో.. బాలాపూర్ లడ్డూ వేలం పాటకు అంతే క్రేజీ ఉంటుంది. బాలాపూర్ వినాయకుడి లడ్డూను సొంతం చేసుకునేందుకు ఎంతో మంది పోటీ పడుతుంటారు. బాలాపూర్ లడ్డూ వేలం పాట కవరేజీ కోసం వందలాది మీడియాలు వస్తాయంటే ఆశ్చర్యం కాదు.

బాలాపూర్ వినయకుడి లడ్డూ వేలం పాటలో ఈసారి మార్పులు చేశారు నిర్వాహకులు. కొత్త నిబంధనలతో లడ్డూ వేలం వేయనున్నారు గతేడాది వరకు బయటి వ్యక్తులు మాత్రమే ముందుగా డబ్బులు డిపాజిట్ చేసేవారు. అయితే ఈ సారి రూల్ మార్చారు. కొత్త నిబంధన ప్రకారం వేలం పాటలో పాల్గొనేవాళ్లంతా గతేడాది లడ్డూ వేలం విలువ అయిన 27 లక్షల రూపాయలను వేలానికి ఒకరోజు ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అలా డబ్బులు డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్న వారినే లడ్డూ వేలం పాటలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. 1994 నుంచి లడ్డూ వేలం పాట పాడుతున్నారు.1994లో కొలనుమోహన్ రెడ్డి అనే రైతు బాలాపూర్ గణపతి లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా ఆనవాయితీగా వేలం పాట సాగుతోంది. ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. 2023లో 27 లక్షల రూపాయలకు దయానంద్ రెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.

 

Back to top button