బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ సీజన్ 4 అనేది అక్టోబర్ 25వ తారీకు నుండి ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ షోలో మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ షోలో సీఎం చంద్రబాబు జైల్లో గడిపినటువంటి సంఘటనలను గుర్తు చేసి షోలో ఉన్నటువంటి ఆడియన్స్ అందరిని కూడా ఏడిపించేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ కి ముందు గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 54 రోజులు పాటుగా సీఎం చంద్రబాబు జైలు జీవితం గడిపాడు. ఇక ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కలిసి వీళ్ళతోపాటుగా బీజేపీని కూడా కలుసుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక 2024వ సంవత్సరం మేలు జరిగినటువంటి ఎన్నికలలో ఎంతో భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో సీఎం చంద్రబాబు గెస్ట్ గా వచ్చి ఇక జైల్లో గడిపినటువంటి రోజుల గురించి పూర్తిగా వివరించారు. ఏ తప్పు చేయని నన్ను అరెస్టు చేసి జైల్లో ఉంచారని తీవ్రంగా పండిపడ్డారు. ఇక తప్పు చేసిన వారిని అసలు వదిలిపెట్టనని బాలకృష్ణ షో ద్వారా తెలిపాడు. అయితే ఈ షోలో చంద్రబాబు జైలు జీవితం గురించి చెప్తున్న సందర్భంలో అక్కడున్నటువంటి ఆడియన్స్ అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక పూర్తి ఎపిసోడ్ అనేది 25వ తారీఖున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.