తెలంగాణ

బస్సు ఆపి చిల్లర చేష్టలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సీరియస్

సోషల్ మీడియా చిల్లర వేషాలకు అడ్డాగా మారింది. పబ్లిసిటీ కోసం కొందరు యువకులు వెర్రి పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా రీల్స్ కోసం చిల్లర పనులు చేసిన ఓ యువకుడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

రీల్స్ కోసం ఓ యువకుడు చిల్లరగా వ్యవహరించాడు. ఫ్రెండ్ పంపిన ఛాలెంజ్ ను స్వీకరించిన ఆ కుర్రాడు.. ఈ పనికి తెగబడ్డాడు. అటువైపుగా బస్సు వస్తుండగా… ప్రయాణికుడిలా రోడ్డు పక్కన నిలబడి ఆపాలంటూ బస్సుకు చేయి పెట్టాడు. దీంతో ప్రయాణికుడు అనుకుని డ్రైవర్ బస్సును ఆపాడు. బస్సులోకి ఎక్కినట్లే ఎక్కి..కిందక దూకి ఆ యువకుడు పారిపోయాడు. ఈ రీల్ ను ఆ కుర్రాడు తన సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నాడు. తన ఫ్రెండ్ ఇచ్చిన ఛాలెంజ్ ను సక్సెస్ చేశానని చెప్పుకున్నాడు.

Read More : రేవంత్‌కు దండం పెట్టిన వీహెచ్.. గాంధీభవన్ లో అంతా షాక్

ఈ వీడియోపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర వేషాలు అవసరమా అని ప్రశ్నించారు ‘సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి’ అని సజ్జనార్ హితవు పలికారు. ఆ ఘటనపై ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయనున్నారని తెలుస్తోంది. ఆ యువకుడిని తగిన శాస్త్రీ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Back to top button