ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఏపీ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. పుష్ప2 టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా జీవో విడుదల చేసింది సర్కార్. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్.
డిసెంబర్ 4న రాత్రి 9గంటల 30 గంటలకు ప్రారంభ బెనిఫిట్ షో, అలాగే అర్ధరాత్రి 1 గంటకు ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో, ప్రీమియర్ షో టికెట్‌పై 800 రూపాయలు పెంచుకోవడానికి అనుమతించింది. డిసెంబర్ 5న ఏపీలో ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 6 నుంచి 17 వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన ధరలు డిసెంబర్ 17వరకు అమల్లో ఉండనున్నాయి.
హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. సినిమా ఇండస్ట్రీ మేలుకోసం ఈ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, అలాగే చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడంలో ఆయన అమూల్యమైన మద్దతు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
పుష్ప2 ఆరు భాషల్లో 12,000 కంటే ఎక్కువ థియేటర్లలో విడుదల కానుంది. ఇది అత్యధిక ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రంగా నిలుస్తోంది. సీన్‌డబ్స్ యాప్ సహాయంతో ప్రేక్షకులు తమకు ఇష్టమైన భాషలో సినిమా ఆస్వాదించవచ్చు, అని నిర్మాతలు ప్రకటించారు. పుష్ప-2 రన్‌టైమ్ 3 గంటలు 20 నిమిషాలు 38 సెకన్లుగా ఉండగా, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. విడుదలకు ముందే బుకింగ్స్, పాటల వ్యూస్ పరంగా రికార్డులు సృష్టించిస్తోంది.
మరిన్ని వార్తలు చదవండి…
పదవులకు వేలం పెట్టిన మధుయాష్కీ పీఆర్వో! ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో ముసలం
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్