క్రైమ్

ఫోక్ సింగర్ శృతి మర్డర్?

తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. శృతిది ఆత్మహత్య కాదని.. ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శృతికి చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. 20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

మ్యారేజ్ తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. అయితే కట్నం తీసుకురావాలని అత్తమామలు శృతి వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడుగా మారాడని ఆరోపిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button