కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ బంపర్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకటించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ణాన్ ధార పేరుతో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీం ను తీసుకొచ్చింది. 25 యేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి పూర్తి పెన్షన్ అందిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 10వేల 579 కోట్ల రూపాయలు ఖర్చు చేయంది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం.. UPSకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. మొత్తం మూడు స్కీములకు కేబినెట్ ఆమోదించింది. ఇందులో మొదటిది 50శాతం భరోసా పెన్షన్ పథకం , రెండోది కుటుంబానికి భరోసా పెన్షన్.. ఇక మూడోది ఏకీకృత పెన్షన్ స్కీమ్. యుపిఎస్ నుంచి దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు ఎన్‌పిఎస్, యుపిఎస్‌లు రెండింటిలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది మోడీ ప్రభుత్వం.