తెలంగాణ

పొంగులేటి ఓవర్ చేయకు.. మంత్రి తుమ్మల సీరియస్ వార్నింగ్?

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు తీవ్రంగా ఉందని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని సమాచారం. ఖమ్మం జిల్లా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. రెడ్లు కూడా బాగానే ఉన్నారు. ప్రస్తుతం రెడ్లంతా పొంగులేటి టీంలో ఉండగా.. కమ్మలంతా మంత్రి తుమ్మలతో క్యారీ అవుతున్నారు. దీంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పొంగులేటి, తుమ్మల వర్గాలుగా రెండుగా చీలిపోయిందని అంటున్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. పొంగులేటి తీరుతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న కొందరు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 తానే అనేలా వ్యవహరిస్తున్నారంటూ పొంగులేటిపై ఫిర్యాదు చేశారని సమాచారం.పొంగులేటిని కంట్రోల్ చేయకుంటే ప్రభుత్వానికి నష్టమని హైకమాండ్‌కు సూచించారని టాక్.

ప్రభుత్వంలో సొంత కంపెనీకి కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని పొంగులేటిపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.అన్ని విషయాల్లో పొంగులేటి కలగజేసుకోవడంపై నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు అంటూ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు బూమరాంగ్ అయ్యాయని చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనూ సాగుతోంది. పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం అబాసుపాలైందనే చర్చ జనాల్లోనూ సాగుతోంది. దీంతో పొంగులేటి ఓవరాక్షన్ తో పార్టీకి నష్టం జరుగుతుందనే టాక్ వస్తోంది. ఈ విషయంలోనే ఆగ్రహంగా ఉన్న మంత్రి తుమ్మల.. ఓవర్ చేయకని పొంగులేటికి వార్నింగ్ ఇచ్చారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button