తెలంగాణ

పేద కుటుంబానికి రూ. 12 వేలు.. రేవంత్ మరో సంచలనం

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు లక్షల రైతు రుణాలు మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈసారి ఒక్కో కుటుంబానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేదలకు 12 వేల రూపాయలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.త్వరలోనే పేదల బ్యాంకు ఖాతాల్లో ఆ డబ్బులను జమ చేస్తామని చెప్పారు.

Read More : రెండు రోజుల్లో ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు.. సీఎం సంచలనం

ఖమ్మం జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క.. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెండో విడత దళిత బంధు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు భట్టి. రైతు రుణమాఫీ లానే పేదలకు 12 వేల రూపాయలు ఇచ్చి తీరుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షల రూపాయలు ఇతర లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ అందిస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ, పంటల బీమా, రైతు బీమా, సబ్సిడీ విద్యుత్తు అందించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సోలార్ వ్యవసాయ పంపు సెట్లు తీసుకొస్తున్నామని విక్రమార్క వివరించారు.

Back to top button