క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ తో పాటు మరికొంతమంది బీఆర్ ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. మూడు నెలల్లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే న్యాయస్థానాలు చెబుతున్నాయని అయినా స్పీకర్ స్పందించకుంటే న్యాయస్థానాలే జోక్యం చేసుకుంటాయంటూ సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏ రాయితో కొడతారు అంటూ ఆయన ప్రశ్నించారు.
అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఓడిపోయిన నేతలతోనే కార్యక్రమాలు చేయిస్తున్నారు అంటూ స్పీకర్ కి విన్నవించారు.