తెలంగాణ
Trending

పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.. డాక్టర్ చీర్ల శ్రీకాంత్

క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప) : పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల భారిన పడకుండా ఉండవచ్చని డాక్టర్ చీర్ల శ్రీకాంత్ అన్నారు. సోమవారం మండలంలోని రామంజాపూర్ శివారులోని చెంచుకాలనీ లో గల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థినీ లకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. హాస్టల్ లో పరిసరాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. విద్యార్థులకు ఎప్పుడు వేడివేడి ఆహారాన్ని అందించాలని, వంటశాల పరిశుభ్రంగా ఉంచాలని, లేదంటే ఈగలు, దోమలు చేరి అనారోగ్యాల బారిన పడతారని సూచించారు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక ఏఎన్ఎం ను సంప్రదించాలని, సమస్య మరింత జటిలంగా ఉంటే వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డాక్టర్ భవ్య, సి హెచ్ ఓ సదానందం, ఏఎన్ఎం లు స్వర్ణలత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…
  2. అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  3. రైతు రుణమాఫీకీ మార్గదర్శకాల జారీ.. అదే ప్రామాణికం!!!
  4. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్
  5. కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

Related Articles

Back to top button