తెలంగాణ

నీట మునిగిన సుర్యాపేట,కోదాడ మున్సిపల్ ఆఫీసులు

క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిది : సూర్యాపేట జిల్లాలో గతంలో ఎప్పుడు లేనంతగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో జిల్లా వ్యాప్తంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం జలమయం అయింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న గదులలో భారీగా వరద నీరు చేరడంతో ఫైల్స్,పలు రకాల వస్తువులు జలమయం అయ్యాయి. మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తమై ఫైళ్లను భద్రపరుస్తున్నారు.

కోదాడ మున్సిపాలిటీ ఆఫీసులోకి వరద నీరు చేరింది. కోదాడలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి 65 జగ్గయ్యపేట వద్ద వరద నీరు ఉదృతంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాబట్టి ప్రజలు ఎవరు దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Read More : నల్గొండ జిల్లాలో రికార్డ్ బ్రేక్..6 గంటల్లో 250 మిల్లిమీటర్ల వర్షం

అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి సేవలు అందించాలని సిబ్బందిని అదేశించారు. ఏదైనా అత్యవసరమైతే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. శిథిలావస్థకు వచ్చిన నివాసలలో ఉండవద్దన్నారు.
చెరువులు, వాగులు వద్దకు వెళ్ళవద్దని సూచించారు.వాతావరణ తడిగా ఉన్నందున కరెంట్ స్థంబాల వద్దకు వెళ్ళవద్దు. సాధారణ ప్రజలు కరెంట్ రిపేర్ పనులు చేయవద్దని చెప్పారు.

Back to top button