
ఉపఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. యూసఫ్ గూడ డివిజన్లోని 246 పోలింగ్ బూతులో కొన్ని హౌస్ నెంబర్స్ లో అక్రమంగా నమోదు చేసిన ఓటర్లు బయటపడుతున్నారు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన వారిని ఇంకా పక్కపక్క నియోజకవర్గాల వారిని ఎక్కడెక్కడో ఉన్నవారిని ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనీ వివిధ డివిజన్లో భూతులలో.. హౌస్ నెంబర్ల పై ఓట్లు నమోదు చేయించారు. ఒక్కో హౌస్ నెంబర్ పై పదుల సంఖ్యలో ఓట్ల నమోదు.
8- 3- 231/B/160
8-3-231/B/118
8-3-231/B/119
8-3-231/B/164 గల హౌస్ నెంబర్ లలో వందల సంఖ్యలో ఓట్ల నమోదు చేశారు. అక్కడ నివసించేవారు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉన్నారు.
బిఆర్ఎస్ బూత్ స్థాయి ఇంటింటి ప్రచారం లో కాంగ్రెస్ ఓటు చోరీ బట్టబయలైంది. నూతనంగా నిర్మాణం చేపట్టిన బిల్డింగులను దొంగ ఓట్ల నమోదు కు వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్ల నమోదు చేయిస్తున్నారని గుర్తించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఓటమీ భయంతో కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
యూసుఫ్ గూడ డివిజన్ పోలింగ్ బూత్ ఇంచార్జ్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఒక రూట్…తెలంగాణ కాంగ్రెస్ మరో రూటు గా ఓటు చోరీ మారిందని విమర్శించారు. ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ చెప్పినట్లుగా జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇతర నియోజకవర్గాల నుండి జూబ్లిహిల్స్ నియోజకవర్గం లో దొంగ అడ్రస్ లతో ఓటు నమోదు చేయిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
బీహార్ లో ఓటు చోరీ జరిగింది అంటూ గగ్గోలు పెట్టిన రాహుల్ గాంధీ ఇక్కడ చేసే ఓటు చోరీ పై ఏం మాట్లాడుతారు అంటూ మండిపడ్డారు వాసుదేవ రెడ్డి.ఇదేనా మీ నీతి అంటూ..రాహుల్ గాంధీ నీ సూటిగా ప్రశ్నించారు మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి.దొంగ ఓట్ల నమోదుపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలని సూచించారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక సజావుగా జరిగేలా అధికారులు వ్యవహరించాలని.. కేంద్రీయ ఎలక్షన్ కమిషన్ వెంటనే విచారణ చేపట్టి దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు.