
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికలపై ప్రస్తావిస్తూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు. నిన్న నర్సంపేట సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేల ఒకడు నోరేసుకుని వీధులన్నీ తిరిగాడు.. ఈ ఉప ఎన్నిక తేల్చుతుంది అని… రేవంత్ సంగతి తేలుస్తా అన్నాడు… ఎక్కడ చెత్త పెరిగిపోయిన అక్కడ చెత్తంతా రేవంత్ వేస్తున్నాడు అని ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేశాడు. ఇల్లు తిరిగి అందరి కడుపులో తలకాయ పెట్టిండు.. చివరికి వాళ్ళ కాళ్ళకు దండం కూడా పెట్టిండు… కానీ చివరికి వీని తీటా అనగాలని ఓటర్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు అని కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలన పై ప్రజలు పూర్తిగా విసిగిపోయారు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Read also : మండల ఎన్నికల అధికారి నిర్లక్ష్యంతో నర్సంపల్లి పంచాయతీ ఎన్నిక వాయిదా
Read also : Chinese Media: పుతిన్ భారత్ పర్యటనపై చైనీస్ మీడియా ప్రశంసలు, కారణం ఏంటంటే?





