క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ధరణి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ భూములు తమకు దక్కేలా చూడాలంటూ రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. మండల కార్యాలయంలోనే పరిష్కరించ దగ్గ సమస్యను పరిష్కరించకుండా అశ్రద్ధ వహిస్తున్నారు. దీంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో కొందరు ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు. తాజాగా ధరణీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎమ్మార్వో కార్యాలయంలో తలక్రిందులుగా తపస్సు చేశాడు.మంత్రులు చెప్పినా ధరణీ దరఖాస్తులు పరిష్కరించడం లేదని ఆరోపించాడు. నెలల తరబడి కార్యాలయాల చుట్టు తిరుగుతున్న మోక్షం దొరకుతలేదంటు తలక్రిందులుగా నిలుచొని తపస్సు చేస్తున్నట్లు నిరసన తెలిపాడు బాధితుడు.
Read More : బుల్డోజర్లు దింపాల్సిందే..హైడ్రాకు జనం సపోర్ట్..నాగార్జునకు షాక్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఇబ్రహింపట్నం మండలం మంగళ్ పల్లి సర్వే నెంబర్ 374 లోని 1-32 గుంటల భూమిని నిషేధిత జాబిత నుండి తొలగించాలని 8 నెలల నుండి ఆఫీస్ చుట్టు తిరిగిన ప్రయోజనం లేదంటు ముంబాయి టాటా ఇన్స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్ లో గోల్డుమెడల్ సాధించిన జీవన్ ఇలా తలకిందులుగా నిరసనకు దిగాడి. తన భూ సమస్య పరిష్కరించండంలో అధికారులు విఫలం చెందారని,ఉన్నత చదువులు చదివిన తనకే ఇలాటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల కు అధికారులు ఎలా అందుభాటులో ఉంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన తహసిల్దార్..తన దృష్టికి ఇప్పుడే సమస్య వచ్చిందని 20 రోజులోగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
Read More : జనంలోకి కేసీఆర్.. ముహుర్తం ఫిక్స్.. ఆయనకు చుక్కలే!