తెలంగాణ

నారాయణపేట కీర్తిని వ్యాపింపజేయాలి: రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట, క్రైమ్ మిర్రర్:-సమ్మర్ క్రికెట్ టోర్నీ(ఎస్.ఎస్.సీ.టీ.) ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలోని ఐటీఐ కాలేజ్ మైదానంలో ఈనెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్ లో 5 జట్లు హోరాహోరీగా తలపడగా, అందులో ఎస్.ఆర్.జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.12222 బహుమతిని అందజేశారు. బుధవారం సాయంత్రం పల్ల బురుజు హనుమాన్ దేవాలయ చౌరస్తాలో ఏర్పాటు చేసిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ.12222 నగదును భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.

క్రీడాకారులు తమకు ఆసక్తి ఉన్న క్రీడా రంగాల్లో ప్రతిభ కనబరిచి నారాయణపేట కీర్తిని దశదిశలా వ్యాపింపజేయాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాళ్లను వెలికి తీసేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. నారాయణపేట పట్టణానికి చెందిన కరాటే, కుంగ్ ఫూ తదితర క్రీడాకారులకు ఆర్థిక సహాయం స్వెటర్లను తమ ఫౌండేషన్ ద్వారా అందజేశామని పేర్కొన్నారు. అంతకుముందు టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువలతో ఘనంగా సత్కరించి షీల్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు పి.ప్రభాకర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, అశోక్ కుమార్, కె.రమేష్, బి.శ్రీనివాస్, ధరణిధర్ దీక్షీత్, ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, హన్మంత్, మన్నె గోపాల్, సుదర్శన్ రెడ్డి, రుద్రారెడ్డి, నర్సింహులు, శివరాజ్, ఎం.సంతోష్, కృష్ణ, నగరి నాగురావు, మేంగ్జీ నందుకుమార్, బసుదే అశోక్ కుమార్, అధిక సంఖ్యలో క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు.

హిందూ పండుగలకే ఆంక్షలు గుర్తుకొస్తాయా!… కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం: ఎమ్మెల్యే రాజాసింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button