
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. రెండు గేట్లు ఎత్తి 54వేల 956 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.20 లక్షల క్యూసెక్కులు నమోదవుతుండగా.. 1.45 లక్షల క్యూసెక్కులను స్పిల్‌వే, విద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్‌ఐ, హంద్రీనీవా ద్వారా విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 1.21 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 5,174 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు.
కృష్ణాబేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టికి 44వేల 54 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 25వేల 640 క్యూసెక్కులను దిగువకు వదులు తున్నారు. నారాయణపూర్‌కు 24వేల 842 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 14వేల 411 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ఫ్లో 69వేల122 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్రకు 29వేల 546 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 38వేల 760 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇటు కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద వస్తుండటంతో.. 15 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 98వేల 440 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 85 గేట్లు ఎత్తి అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు.