తెలంగాణరంగారెడ్డి

నల్లవెల్లి రెవెన్యూ పరిధి మాల్ లో నీకు ఈ ప్లాట్లు ఎక్కడివి రవీందర్?

నీ భార్య వీణా మాల్ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడే... ఆమ్లెట్ విలేజ్ లలో నువ్వు ప్లాట్ల కొనుగోలు వెనుక ఆంతర్యం ఏమిటి??

  • నీ భార్య వీణా మాల్ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడే… ఆమ్లెట్ విలేజ్ లలో నువ్వు ప్లాట్ల కొనుగోలు వెనుక ఆంతర్యం ఏమిటి??
  • గ్రామపంచాయతీ లేఅవుట్లలో 10 శాతం ఓపెన్ స్పేస్ వదిలి పెట్టాల్సిన స్థిరాస్తి వ్యాపారులు
    , నువ్వు ప్లాట్లు కొనుగోలు చేసిన వెంచర్లలో ఎందుకు వదిలిపెట్టలేదో చెప్పగలవా అంటూ ప్రశ్నిస్తున్న స్థానికులు
  • 10 శాతం ఓపెన్ స్పేస్ వదిలి పెట్టాల్సిన అవసరం లేకుండానే తమ లేఅవుట్ లకు అనుమతులు ఇచ్చినందుకు అప్పుడు పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న వీణా కు ప్లాట్లను స్థిరాస్తి వ్యాపారులు గిఫ్ట్ గా ఇచ్చారన్న ఆరోపణలకు… మీ సమాధానం ఏమిటి?
  • మీ భార్యకు గిఫ్ట్ గా ఇచ్చిన ప్లాట్లను స్థిరాస్తి వ్యాపారులు మీ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లుగా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదా??
  • మాల్ పరిసర ప్రాంతాలలో తవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్న అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీణా అక్రమాల భాగోతం
  • ఇప్పటికే వెలుగులోకి వచ్చిన రెండు ప్లాట్ల వ్యవహారం… త్వరలోనే మరికొన్ని ప్లాట్ల ఆధారాలను మీ ముందు పెడతాం
  • నెర్రెపల్లి దివ్య సాయి నగర్ ప్లాట్ల ప్రహరీ గోడల , తాత్కాలిక నిర్మాణాల కూల్చివేతల గురించి గ్రామపంచాయతీ కార్యదర్శి వీణాను ప్రశ్నిస్తే… క్రైమ్ మిర్రర్ జర్నలిస్టులను తన ఆస్తులు మొత్తం అమ్మైనా చంపేస్తానని నీ సన్నిహితుల వద్ద ప్రేలాపనలు నిజం కాదా?
  • ప్రశ్నించిన వారందరినీ చంపుకుంటూ పోతానంటే… చట్టం చూస్తూ ఊరుకుంటుందా?, ఈ వ్యవహారంలో పోలీసులు సుమోటోగా రవీందర్ పై కేసు నమోదు చేయాలన్న జర్నలిస్టుల సంఘాలు

( క్రైమ్ మిర్రర్ ప్రత్యేక ప్రతినిధి ) : మాల్ పంచాయతీ కార్యదర్శి గా వీణ, పనిచేసే సమయంలోనే ఆమె భర్త రవీందర్ నల్లవెల్లి గ్రామంలోని రెండు వేరు వేరు వెంచర్లలో రెండు ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్లాట్లను కొనుగోలు చేయడంలో ఎవర్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా, తన భార్య పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమ్లెట్ విలేజ్ లలోనే ఆమె భర్త ప్లాట్లు కొనుగోలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నల్లవెల్లి రెవెన్యూ సర్వేనెంబర్ 698, 691 లలో 334 చదరపు గజాల ప్లాట్, అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీణ భర్త రవీందర్ కొనుగోలు చేశారు. అలాగే అదే నల్లవల్లి గ్రామం లోని సర్వేనెంబర్ 572 లోని హనుమాన్ నగర్ 124 చదరపు గజాల ప్లాట్ ను కూడా కొనుగోలు చేశాడు.

Read More : బుల్డోజర్లు దింపాల్సిందే..హైడ్రాకు జనం సపోర్ట్..నాగార్జునకు షాక్ 

ఇక్కడి వరకు ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ రెండు వెంచర్లలో గ్రామపంచాయతీకి కేటాయించాల్సిన 10% ఓపెన్ స్పేస్ ను స్థిరాస్తి వ్యాపారులు కేటాయించలేదని స్థానికులు తెలిపారు. 10 శాతం ఓపెన్ స్పేస్ కేటాయించకపోయినప్పటికీ, ఈ వెంచర్లకు అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శి వీణ ఎలా అనుమతులను ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. 10 శాతం ఓపెన్ స్పేస్ వదిలి పెట్టాల్సిన అవసరం లేకుండానే, పంచాయితీ ద్వారా వెంచర్లకు అనుమతులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 10 శాతం ఓపెన్ స్పేస్ వదిలి పెట్టకపోయినా ఆ వెంచర్లకు వీణ అనుమతులు ఇవ్వడం, అదే వెంచర్లలో రవీందర్ ప్లాట్లను కొనుగోలు చేయడం వెనుక ఏదో మతలబు ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 శాతం ఓపెన్ స్పేస్ వదిలి పెట్టకపోయినా లే అవుట్ లకు అనుమతులు ఇచ్చినందుకు స్థిరాస్తి వ్యాపారులు గ్రామపంచాయతీ కార్యదర్శి వీణాకు ప్లాట్లను గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ ప్లాట్ లను ఆమె భర్త రవీందర్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలకు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాల్ పరిసరా ప్రాంతాలలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో వీణా చేసిన అక్రమాల బాగోతం తవ్వే కొద్ది వెలుగులోకి వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read More : నా భూమి నాకు ఇవ్వండి.. MRO ముందు తలకిందులుగా గోల్డ్ మెడలిస్ట్ నిరసన 

ప్రస్తుతానికి ఆమె రెండు ప్లాట్లను స్థిరాస్తి వ్యాపారుల నుంచి గిఫ్ట్ గా తీసుకున్నట్లు ఆధారాలతో సహా వెళ్లడయ్యిందన్న స్థానికులు, త్వరలోనే మరికొన్నింటి ఆధారాలను ప్రజల ముందు బయట పెడతామని చెప్పారు. నెర్రవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దివ్యసాయి నగర్ లో ప్లాట్ల చుట్టూ ప్రహరీ గోడలు, తాత్కాలిక నిర్మాణాలను ఏ ప్రాతిపదికన కూల్చివేశారని ప్రశ్నించిన క్రైమ్ మిర్రర్ జర్నలిస్టులను తన ఆస్తులను అమ్మయినా చంపేస్తానని రవీందర్ తన సన్నిహితుల వద్ద ప్రేలాపనలు పేలుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతానంటే, చట్టం చూస్తూ ఊరుకుంటుందా అని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. సమాజ హితం కోసం నిలబడే జర్నలిస్టులను చంపేస్తానని బెదిరించిన రవీందర్ పై సుమోటోగా కేసును నమోదు చేయాలని జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు పోలీసులను కోరారు.

శంకర్పల్లి మండలంలో మూడు పంచాయితీలలో సెక్రటరీగా విధులను నిర్వహించిన వీణ, అక్రమాల చిట్టా వార్తా కథనాల రూపంలో త్వరలోనే మీ క్రైమ్ మిర్రర్

ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసే ఈ రెండు ప్లాట్లను ఇటీవల రవీందర్ విక్రయించారు.

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది…

Back to top button