తెలంగాణ

నల్గొండ జిల్లాలో తాగునీటి కష్టాలు.. కేసీఆరే రావాలంటున్న జనాలు

తెలంగాణలో మళ్లీ పాతరోజులు దర్శమిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో తాగునీటి కష్టాలు పెరిగిపోతున్నాయ. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు జనాలు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవి. వేసివ కాలం వచ్చిందంటే నీళ్లు దొరికేవి కావు. కిలోమీటర్ల కొద్ది నడిచి బావుల నుంచి నీళ్లు తెచ్చుకుని తాగేవారు జనాలు. గతంలో సమ్మర్ వచ్చిందంటేనే జనాలు హడలిపోయే పరిస్థితి. అయితే తెలంగాణ వచ్చాక క్రమంగా తాగునీటి కష్టాలు దూరమయ్యాయి.

మిషన్ భగీరథతో మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికి తాగునీటి నల్లా వచ్చింది. గత ఐదేళ్లుగా తెలంగాణలో ఎలాంటి తాగునీటి సమస్య రాలేదు. వేసవి కాలంలోనూ ప్రజలు ఇంటివద్దే నల్లా దగ్గర నీళ్లు పట్టుకుని హాయిగా తాగారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. నల్గొండ జిల్లాల్లోని గ్రామాల్లో తాగునీటికి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లా నీళ్లు రాక.. గత్యంతరం లేక వ్యవసాయ బోర్ల నుంచి తాగునీటిని పట్టుకొస్తున్నారు మహిళలు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. సూర్యాపేట – నేరేడుచర్ల మండలంలోని పులగంబండా తండాలో సర్పంచుల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేదు.దీంతో ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి.సరిపడా నిధులు లేక సమస్య లపై అధికారులు స్పందించడం లేదు. బోరు మోటార్ కాలిపోయి పులగంబండా తండాలో గత 5 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత్యంతరం లేక గిరిజన మహిళలు, చిన్నారులు పొలం గట్లపై నుంచి నడుచు కుంటూ వెళ్లి అతికష్టంపై వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మోటార్‌కు మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తండా వాసులు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button