ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు వేశారు. ఎన్నికల సమయంలో నాపై నమోదైన నంద్యాల కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. హీరో అల్లు అర్జున్ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారించేటువంటి అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో 144 సెక్షన్ మరియు పోలీసుల యాక్ట్ 30 అమలులో ఉండగా, ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా జన సమీకరణ వచ్చినటువంటి సందర్భంగా అప్పుడు కేసు నమోదు చేశారు. దానిని ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసును తొలగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇకపోతే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అలాగే వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నించున్నటువంటి అల్లు అర్జున్ ఫ్రెండ్ కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ షాకయ్యారు. ఇక అప్పటినుండి మెగా ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ కి మధ్య గొడవలు రాగా వీటిని ఫాన్స్ మరింతగా రచ్చ రచ్చ చేశారు. టిడిపి ఫ్యాన్స్ అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ అందరు కూడా ఒకటి అల్లు అర్జున్ ని అలాగే వైసిపిని తిట్టడం అనేది ప్రారంభించిన విషయం మనందరం చూసే ఉంటాం. ఇలా ఎప్పుడైతే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు ఇక అక్కడి నుండి ఫ్యాన్స్ మధ్య అలాగే రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు అనేవి ప్రారంభమయ్యాయి.