జాతీయంరాజకీయం

దేశంలో జమిలీ ఎన్నికలకు బీజేపీ స్కెచ్!

క్రైమ్ మిర్రర్ , తెలంగాణ బ్యూరో : ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. ఈ నినాదాన్ని కొంత కాలంగా బీజేపీ వినిపిస్తోంది. ఒకే దేశం- ఒకే పన్ను లాగే ఒకే ఎన్నిక ఉండాలనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వస్తోంది. మరికొన్ని వర్గాలు మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి పూర్తి విరుద్దమని చెబుతున్నారు. బీజేపీ వర్గాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం జమిలీ ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలోనూ జమిలీ ఎన్నికలను ప్రస్తావించారు ప్రధాని మోడీ.

ఒకే ఎన్నిక అనే ఆలోచనకు మద్దతు ఇవ్వాలని ఎర్రకోట నుంచి రాజకీయ సమాజాన్ని కోరారు ప్రధాని మోడీ. తున్నా’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు ఇది కీలకమని అన్నారు. తరచు ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధిలో స్తబ్దత నెలకొంటున్నదని అన్నారు. ఈ రోజు ప్రతి పథకం, ప్రతి కార్యక్రమం ఎన్నికలతో ప్రభావితమవుతున్నదని చెప్పారు. ప్రతి చర్య రాజకీయ రంగు పులుముకుంటున్నదని అన్నారు. బంగ్లాదేశ్‌లో పరిణామాల పట్ల పొరుగుదేశంగా భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నదని మోదీ చెప్పారు. ఆ దేశంలో హిందువులు మైనార్టీలుగా ఉన్నారన్న అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించారు.

Back to top button