హైదరాబాద్ లో మరో వివాదాస్పద ఘటన జరిగింది. ఇటీవల కాలంలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని సలీం అనే వ్యక్తి ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఆ తర్వాత కూడా శంషాబాద్ ఏరియాలో వరుసగా మూడు ఆలయాలపై దాడులు జరిగాయి. దాడులపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి.
తాజాగా మరో వివాదాసస్పద ఘటన జరిగింది.దేవాలయంలో ముస్లిం వ్యక్తి నమాజ్ చదవడం కలకలం రేపుతోంది. నాగోల్- ధనలక్ష్మీ నగర్ చండి అమ్మవారి ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు అయ్యప్ప మాలధారులు.మాలధారణ చేసిన ఓ స్వామి వెంట వచ్చిన ముస్లిం వ్యక్తి నమాజ్ చేసినట్లు గుర్తించారు. అయితే అ య్యప్ప మాల వేసిన వ్యక్తి కూడా వేరే మతానికి చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అమ్మవారి దేవాలయం వద్దకు చేరుకున్నారు. సతీష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామి మాలధారణ వేసి నిన్నటితో దీక్ష ముగించుకొని శబరి నుండి తిరిగి రావడం జరిగింది. ఈరోజు మంగళవారం కావడంతో మాలధారణ తీయకూడదని అమ్మవారి దేవాలయానికి వెళ్ళగా అతని వెంట బిలాల్ పిడుగురాళ్ల కు చెందిన స్నేహితుడిని తీసుకొని వెళ్ళాడు అతను అక్కడ కూర్చుని ఉండగా అక్కడ ఉన్న మిగతా అయ్యప్ప స్వామి మాలధారన ధరించిన స్వాములు ముస్లిం వ్యక్తి వచ్చాడంటూ గొడవపడి అతన్ని బయటకు పంపియడం జరిగింది, అయితే ఈ బిలాల్ అనే వ్యక్తి కన్వర్టెడ్ ముస్లిం అతని పూర్తి పేరు వెంకటేష్ గా గుర్తించారు పోలీసులు, నాగోల్ పోలీసులు ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నారు.