తెలంగాణ

దీపావళికి ముందే ఇద్దరు నేతలు అరెస్ట్.. మంత్రి పొంగులేటి బాంబ్

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిరసనలు, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటనలతో ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో కాళేశ్వరంపై జ్యూడిషియల్ కమిటి విచారణ వేగంగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాంబా పేల్చారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

సియోల్ పర్యటనలో ఉన్న రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి దీపావ‌ళి రాక‌ముందే రాజ‌కీయ సంచ‌ల‌నాలు సృష్టించే పొలిటిక‌ల్ బాంబ్‌ల‌ను పేల్చేశారు. సియోల్‌లో హ‌న్ న‌ది పున‌రుజ్జీవ‌న ప‌రిస్ధితుల‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్క‌డ ఓ తెలుగు జాతీయ ఛాన‌ల్ ప్ర‌తినిధికి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి సుమారు 8 నుంచి 10 ప్ర‌ధాన పాయింట్ల‌లో ఈ చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. దీనికి సంబంధించి ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాల‌తో సిద్ధ‌మ‌య్యాయ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు.

సియోల్ నుంచి మ‌రో 2 రోజుల్లో హైద‌రాబాద్ చేరేస‌రిక‌ల్లా చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. కేవ‌లం క‌క్ష సాధింపులా గాక పూర్తిగా ఆధారాల‌తో చ‌ర్య‌లు ఉంటాయ‌ని, ఎంత‌టివారినైనా ఉపేక్షించేదిలేద‌న్నారు. తొంద‌ర‌ప‌డి ఎటువంటి ఆధారాలు లేకుండా వెళ్ల‌బోమ‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచార‌ణ దాదాపు పూర్త‌యిందని మొత్తానికి ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్ర‌జ‌లు ఇంత‌వ‌ర‌కు ఎటువంటి చ‌ర్య‌లు లేవ‌ని భావించ‌వ‌ద్ద‌ని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాల‌తో ముఖ్యంగా ఫైళ్లు సాయంతో ముందుకు వెళ్ల‌బోతున్నామ‌ని సంచ‌ల‌నాల‌కు మంత్రి తెర‌తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button