తెలంగాణ

దసరాకు మరో 12 మంది ఎమ్మెల్యేలు జంప్?రేవంత్‌తో సీక్రెట్ మీటింగ్.

తెలంగాణలో ఎమ్మెల్యేల జంపింగ్స్ కొన్ని రోజులుగా ఆగిపోయాయి. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు చేరనున్నారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ ఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ జరుగుతుందని ప్రచారం జరిగింది. కాని వలసలు ఆగిపోయాయి. ఇంతలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గులాబీ నేతలు హైకోర్టుకు వెళ్లడం.. ఆ కేసును విచారించిన ధర్మాసనం నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిండం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం కనిపిస్తోంది. దీంతో ఇక ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరనే భావించారు. కాని మళ్లీ సీన్ మారినట్లు కనిపిస్తోంది.

పార్టీ మారాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాలతో జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. దీంతో ఆ అనర్హత వేటు నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని సమాచారం. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కంటోన్మెంట్ ఫలితం తర్వాత అసెంబ్లీలో గులాబీ బలం 38కి తగ్గింది.

Read More : రేవంత్ మొగోడు.. సూపర్ సీఎం!బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్

38లో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 28 మందిలో 12 మంది కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్. అందరిని ఒకేసారి జాయిన్ చేసుకుని.. సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని అంటున్నారు. అదే జరిగితే హైకోర్టు కూడా ఫిరాయింపులపై చేసేదేమి ఉండదు. అందుకే ఆ దిశగా సీఎం రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని.. 12 మంది గులాబీ ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారని తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని ..కాంగ్రెస్ లో చేరేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో చేరాలంటే మంత్రి పదవులు కావాలని షరతులు విధించిన ఎమ్మెల్యేలు..మారిన రాజకీయ పరిణామాలతో మంత్రి పదవి అక్కర్లేదు..పార్టీలో చేర్చుకోండి అంటూ కబురు పంపుతున్నట్లు జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దసరాకు ఎమ్మెల్యేల చేరికకు సీఎం రేవంత్ ముహుర్తం ఫిక్స్ చేశారని అంటున్నారు.

Back to top button