తెలంగాణ

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జనంలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 11 నెలలు ముగిసింది. డిసెంబర్ 7కు ఏడాది అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది ముగియగానే జనంలోకి రావడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ జనంలోకి రాబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుండగా.. తాజాగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జనంలోకి రాబోతున్నానని చెప్పారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ లో పాలకుర్తి నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. ఇటీవల పాలకుర్తిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన గిరిజన బిడ్డ శ్రీనివాస్ ఇంటికి త్వరలో వస్తానని చెప్పారు. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గడ్డ పాలకుర్తి నుంచే కేసీఆర్ జనంలోకి రాబోతున్నారని తెలుస్తోంది.

పాలకుర్తి నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. వచ్చే ఎనికల్లో వందశాతం మనమే గెలుస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తయింది.. ప్రజలు ఏం కోల్పోయారో వాళ్లకు అర్థమైంది..ప్రజలు మనపై విశ్వాసంతో ఉన్నారు, అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు కేసీఆర్. అధికారంలోకి రాగానే వాణ్ణి లోపల వేయాలి..విన్నీ లోపల వేయాలని మనం చూడం కాదు పాలన అన్నారు. ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలి..నిర్మాణము చేయాలి..పదిమందికి లాభం చేయాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో మనం మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే..కానీ 90 శాతము ఎవరు ఆడగకున్న పనులు చేసి చూపించామన్నారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి , సినీ ఆర్టిస్ట్ రవితేజ బిఅర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి వాళ్లను ఆహ్వానించారు కేసీఅర్.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button