తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయాల్లో చేరి తమిళ వెట్రీ కళగం పార్టీని స్థాపించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా విజయ్ దళపతి ఇక మీద సినిమాలు చేయడం మానేస్తున్నాడని కూడా అందరికీ తెలిసిందే. విజయ్ దళపతి చివరిసారిగా గోట్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి మంచి హిట్ను అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేస్తారన్న ప్రచారం కూడా బాగానే సాగింది.
ఇక సూపర్ స్టార్ విజయ్ దళపతి తను నాయకుడిగా తమిళ వెట్రీ కలగం పార్టీ నుండి నిన్న ఆదివారం మొట్టమొదటి సభను ఏర్పాటు చేశాడు. ఇక ఈ సభలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది దాకా హాజరయ్యారంటేనే అర్థమవుతుంది సూపర్ స్టార్ విజయ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది.
విజయ్ పెట్టినటువంటి మొట్టమొదటి సభకి ఇంతమంది అభిమానులు అలాగే పార్టీ నాయకులు రావడంతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన ప్రసంగంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్క పార్టీ గురించి తనకు ఉన్నటువంటి అనుబంధం చెప్పేశాడు. బిజెపిని సైద్ధాంతిక ప్రత్యర్థిగా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం అధికారం లో ఉన్న డీఎంకే స్టాలిన్ పార్టీ తనకు అసలు సిసలు అభ్యర్థి పార్టీ అని చెప్పుకోచ్చారు. ధీంతో చాలా తెలివిగా విజయ్ తలపతి రాజకీయాల్లో ముందుకెళ్తున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే విజయ్ దళపతి ఖచ్చితంగా ఏదో ఒకనాడు సీఎం అవుతాడని విజయ దళపతి అభిమానులు అలాగే రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు కూడా అంటున్నారు.