తెలంగాణ

తెలంగాణ కంచి..కొడకంచి

– ఈరోజు నుండి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ఆదినారాయణుడు
-తెలంగాణలోని వెయ్యేల చరిత్ర కలిగిన క్షేత్రం..
-బంగారు బల్లి, వెండి బల్లి బ్రహ్మసూత్ర శివలింగం.. ఈ ఆలయ ప్రత్యేకత…
-బ్రహ్మోత్సవాలు 22 న మొదలుకొని 31వ తేదీ వరకు ముగింపు…
-25న స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అశ్వసేవ ఊరేగింపు…
-29న జాతర, స్వామివారి దివ్య రథోత్సవం ఊరేగింపు..

పటాన్ చెరు, క్రైమ్ మిర్రర్:- సంగారెడ్డి జిల్లా, జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కొడకంచి గ్రామంలో తెలంగాణ కంచి గా పేరుగాంచిన అతి పురాతన ఆలయం ఉన్నది. కొడకంచి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారు కొలువు దీరి ఉన్నారు. ఆలయం వెయ్యేల్ల చరిత్ర కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా పరడవిల్లుతున్నది. బంగారు బల్లి, వెండి బల్లి ఈ యొక్క ఆలయానికి ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. కాంచీపురంలోని వరదరాజ పెరుమల్ ఆలయంలో ఉన్నట్లుగానే ఇక్కడ బంగారు బల్లి, వెండిబల్లి ప్రతీక. కంచి క్షేత్రంలో జరిగే పూజలు ఈ యొక్క ఆలయంలో తమిళ్ పెరుమల్ వేదమంత్రాలతో ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఆలయానికి తమిళనాడులోని కంచికి వెళ్లకుండా తెలంగాణ కొడకంచికి రావాలని ఇక్కడ ప్రతిదీ, సరీసృపాల వల్ల కలిగే దోషాలు, పాము, బల్లి వంటి సకల దోషాలు ఈ ఆలయంలోని ప్రతిమలను తాకడం ద్వారా ఆయా దోషాల నుండి విముక్తి పొందుతారని నానుడి. ఆలయ సమీపంలో ఉన్నటువంటి తెలంగాణలోని వెయ్యేల చరిత్ర గలిగిన బ్రహ్మసూత్ర శివ లింగం అతి పవిత్రమైన శివ లింగం. నీటిలో కొట్టుకు వచ్చిందని ఇది కోటి శివ లింగాలతో సమానమని భక్తులు నిరంతరం అభిషేకాలతో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

<a href=”https://crimemirror.com/illegal-affair-the-husband-was-killed-even-though-the-illegal-relationship-was-a-hindrance-the-wife-was-arrested/”>Illegal affair : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నా భర్త హత్య… భార్య అరెస్ట్.!

ఈ ఆలయం సందర్శించడం ద్వారా సకల అష్టైశ్వర్యాలను పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారని, కొడకంచి దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుందని, ఆలయ కమిటీ చైర్మన్ అల్లాణి రామోజీరావు తెలిపారు. ఈ ఆలయ బ్రహ్మోత్సవ వార్షికోత్సవాలు ఈరోజు మొదలుకొని 31వ తేదీ వరకు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 22న శుద్ధ చవితి అధ్యయనోత్సవం తులాకి సేవ, 23న పంచమి అధ్యయనోత్సవం, సాయంత్రం తులాకి సేవ ఊరేగింపు, 24న పరమపధోత్సవం పుట్ట బంగారు సేవ, అగ్ని ప్రతిష్ట, 25న శ్రీవారి ధ్వజ రోహణం, సాయంత్రం స్వామివారి దివ్య కళ్యాణోత్సవం, అశ్వసేవ ఊరేగింపు, 26న హనుమంత సేవ ఊరేగింపు, 27న గరుడ ప్రతిష్ట గరుడ వాహన సేవ ఊరేగింపు, 28న తిరువంజనం స్వామివారి అలకసేవ, హోమం బలి మరణం, రథ ప్రతిష్ట. 29న ముఖ్య ఘట్టం జాతర స్వామివారి దివ్య రథోత్సవం ఊరేగింపు 30న దోపిసేవ హోమం పూర్ణహుతి పుష్పయాగం భూత బలి సప్తవరణాలు ఏకాంత సేవ, 31న త్రయోదశి శనివారం 16వ పండుగ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు నారాయణచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ రామోజీరావు పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆదినారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలకు, జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మంచినీటి సదుపాయం, వైద్య సిబ్బంది, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ లో ఏర్పాటు, ఆలయ కమిటీ వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సు ప్రయాణం భక్తులకు అందుబాటులో ఉండేలా పటాన్ చెరు నుండి బొంతపల్లి కమాన్ వరకు 515 నెంబర్ గల ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, ఓఆర్ఆర్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 నుండి కూడా భక్తులు రావచ్చని ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ అల్లాణి రామోజీరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button