తెలంగాణ

తెలంగాణలో ప్రజలను బురిడీ కొట్టించిన రియల్ ఎస్టేట్ సంస్థ!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది చాలా కంపెనీల ద్వారా మోసపోతున్న సంగతి మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాదు నగరంలో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రజలను బురిడీ కొట్టించింది. స్క్వేర్ అండ్ యార్డ్ ఫార్మ్ హౌస్ మరియు విల్లాల పేరుతో భారీ మొత్తంలో కోట్లలో మోసానికి పాల్పడింది. అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు చెందిన అల్లం నాగరాజు అనే బాధితుడు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ సంస్థ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు సంస్థ డైరెక్టర్లు బైరా చంద్రశేఖర్, వేములపల్లి జాన్వి, గరిమెళ్ళ వెంకట అఖిల్, రెడ్డిపల్లి కృష్ణ చైతన్యల్ని అరెస్ట్ చేశారు.

హైదరాబాదులోని శివారులో ఫామ్ హౌస్ లు మరియు విల్లాల పేరుతో ప్రజల వద్ద నుండి దాదాపుగా 24 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు సమాచారం అందించారు. ఈ రెండిటిపై పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చని చంద్రశేఖర్ ప్రజలకి ఆశ చూపాడు. ఇక ఈ చంద్రశేఖర్ మాటలు నమ్మి దాదాపుగా 120 మంది స్క్వేర్ అండ్ యార్డ్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇక గత కొద్ది రోజులుగా చంద్రశేఖర్ నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆఫీసుకు వచ్చి బాధితులు నిలదీయగా నా దగ్గర డబ్బులు లేవు అంటూ చంద్రశేఖర్ చేతులెత్తేశాడు. ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఈ సమస్త పై పోలీసులు కేసు నమోదు చేసి అందులో ప్రజలను మోసం చేసిన సంస్థ లోని నలుగురు డైరెక్టర్లను అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button