తెలంగాణ

తెలంగాణకు వరద గండం.. మరో అల్పపీడనంతో భారీ వర్షం

కుండపోత వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణకు మరో వరద గండం ముంచుకొస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు బాంబ్‌పేల్చారు.ఇది తుపానుగా మారి,విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తున్నారు.ఇవాళ రేపట్ల దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది.ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరాతి వాతావరణ కేంద్రం తెలిపింది.గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇవాళ తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో.. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లును ప్రభుత్వం హై అలర్ట్‌ చేసింది.

Back to top button